

షావోమీకి చెందిన రెడ్‌మీ సంస్థ తన M-సిరీస్‌లో భాగంగా Redmi M100 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అధునాతన ఫీచర్లను ఇందులో అందించింది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. గరిష్ఠంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. స్క్రీన్ రక్షణ కోసం Corning Gorilla Glass Victus 2ను అందించారు. MediaTek Dimensity 7300-Ultra ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 12GB LPDDR4X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా Xiaomi HyperOSను అందించారు.
కెమెరాల విషయానికి వస్తే, వెనుకవైపు OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,500mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. స్టీరియో స్పీకర్లు, X-axis లీనియర్ మోటార్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, NFC, IP68 రేటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 చైనీస్ యువాన్లు (సుమారు రూ.36,000). బ్లాక్, వైట్, సయాన్, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. భారత్‌లో విడుదలపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!