

కోలీవుడ్ యంగ్ హీరోయిన్ దుషారా విజయన్ ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇటీవల ‘వీర ధీర సూరన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ‘ఎక్జామ్’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం మాధవన్‌తో ‘జీ.డి. నాయుడు’ బయోపిక్, విశాల్‌తో ‘మకుటం’, అలాగే పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్పత్త పరంబరై రౌండ్-2’ వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో దుషారా మాట్లాడుతూ, మలయాళ చిత్ర పరిశ్రమ తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపింది. భవిష్యత్తులో మలయాళ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పాలని ఉందని వెల్లడించింది. అలాగే ‘సర్పత్త పరంబరై’ సినిమాలో తాను పోషించిన మరియమ్మ పాత్ర తన కెరీర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పింది. ప్రస్తుతం ‘సర్పత్త పరంబరై 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే సినిమా పట్టాలెక్కనుందని వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!