

సామాజిక మాధ్యమాల్లో సినిమాలపై విమర్శలు, ట్రోలింగ్ పెరుగుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి చుట్టూ కూడా చర్చ మొదలైంది. నాని నటించిన ది ప్యారడైజ్ కూడా విమర్శలకు గురైంది. అయినా కానీ ఈ సినిమా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని సమాచారం. ఇప్పుడు రణబాలిపై కూడా కొందరు వర్గాలు విమర్శలు మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో లైగర్, ఫ్యామిలీ స్టార్ సమయంలో విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పటికీ చర్చకు వస్తున్నాయి.
అందుకే ఈసారి ప్రచారంలో ఎలాంటి అతిశయోక్తులు లేకుండా ముందుకు వెళ్లాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.విడుదల సమయం దగ్గర పడుతుండటంతో రాహుల్ సాంకృత్యన్ బృందం నిర్మాణానంతర పనులు, ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడం రణబాలి ప్రత్యేకతగా మారింది. ఈ చిత్రానికి వారం ముందు ఆదర్శ కుటుంబం, ఒకరోజు ముందు జైలర్ 2 విడుదల కానున్నాయి. అయినప్పటికీ రణబాలి బృందం కథ, కంటెంట్‌పై నమ్మకంతో ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!