
సినిమాలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న అభిమాన వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆయన సినిమాలకు లభించే ఆదరణ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల రీ రిలీజ్ అయిన హ్యాపీ సినిమా మరోసారి ఆయన క్రేజ్‌ను నిరూపించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా థియేటర్లలో మంచి స్పందన రావడం విశేషం.
ఈ విజయంతో ఇప్పుడు ఆయన కెరీర్లో కీలకమైన ఆర్య సినిమాను మళ్లీ విడుదల చేసే ఆలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తెలుగు, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘పుష్ప’ తర్వాత దేశవ్యాప్తంగా పెరిగిన బన్నీ క్రేజ్‌తో ఈ రీ రిలీజ్‌కు భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!