

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే, తన అందం మరియు నటనతో కుర్రకారులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ మూవీ విజయంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌తో ‘సెయాన్’ సినిమాలో నటిస్తున్న ఆమెకు తాజాగా మరో భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్‌గా నటించేందుకు ఆమెను చిత్రబృందం సంప్రదించినట్లు టాక్.
సుజీత్ రాసుకున్న ప్రత్యేకమైన కథ, తన పాత్ర బలంగా ఉండటంతో భాగ్యశ్రీ కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి అయిన ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నాని-సుజీత్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!