

‘కాంతార’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా దర్శకుడు సందీప్ సింగ్ రూపొందిస్తున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివాజీ మహారాజ్ వీరత్వం, వ్యూహాలను అత్యున్నత సాంకేతికతతో ఆవిష్కరించేందుకు చిత్రబృందం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.
ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘వైకింగ్స్’ వంటి ప్రాజెక్టులకు పనిచేసిన హాలీవుడ్ యాక్షన్ డిజైనర్ మార్క్ హెన్సన్ బృందాన్ని ఎంపిక చేశారు. ప్రస్తుతం ‘జై హనుమాన్’ చిత్రీకరణలో ఉన్న రిషబ్ శెట్టి, ఆ సినిమా పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొననున్నారు. మహారాష్ట్రలోని పలు చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్ జరగనుండగా, రాజమాత జిజాబాయి పాత్రలో షెఫాలీ షా, ఔరంగజేబు పాత్రలో వివేక్ ఒబెరాయ్, మరో కీలక పాత్రలో అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!