

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోని స్టైలిష్ యాక్షన్ చిత్రాల్లో పంజా ఒకటి. విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 11 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేయడంతో అభిమానుల నుంచి ఈ సినిమాకు ఊహించని స్థాయిలో స్పందన లభించింది.
రీ రిలీజ్‌లో పంజా ప్రపంచవ్యాప్తంగా రూ.5.12 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. 2011లో అప్పటి మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఈ చిత్రం రూ.8 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉంది. అప్పటి కలెక్షన్స్‌తో పోలిస్తే ఇప్పటి రీ రిలీజ్‌కు పెద్దగా తేడా లేకపోవడం పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో సారా జేన్ డయాస్ హీరోయిన్‌గా నటించగా, బ్రహ్మానందం, జాకీ ష్రాఫ్, అడివి శేష్, అలీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!