

బేబీ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి ‘ఎపిక్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్’ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 4న ‘ఎపిక్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. బేబీలో లవ్, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఆనంద్-వైష్ణవి జోడీ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!