

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన ఆరంభాన్ని నమోదు చేసింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజే రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకుంది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలకు వచ్చిన అద్భుత స్పందన తొలి రోజు కలెక్షన్లలోనూ కనిపించింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘పెద్ది’ తొలి రోజు భారత్‌లో సుమారు రూ.69.50 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దేశీయంగా రూ.82 కోట్లకు పైగా గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.30 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.112 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి భారీ ఓపెనింగ్ రికార్డు నెలకొల్పింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!