
క్రీడలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘రాకా’లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్ సినిమాలు డిసెంబర్‌లో విడుదలై భారీ విజయాలు సాధించడంతో పాటు అల్లు అర్జున్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాయి. ముఖ్యంగా పుష్ప 1 ద్వారా ఆయన నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
ఈ నేపథ్యంలో అదే డిసెంబర్ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ‘రాకా’ను కూడా అదే నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. కీలక పాత్రల్లో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!