
సినిమాలు

‘పెద్ది’ చిత్రంలో అప్పలసూరి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు జగపతిబాబు తాజాగా తన జీవితం, కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజజీవితంలో నటించాల్సిన అవసరం తనకు లేదని, ఏ విషయం అయినా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికే ఇష్టపడతానని తెలిపారు. జీవితంలో జరిగిన ప్రతి సంఘటన తనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పిందని, అందుకే ఎలాంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు.
అబద్ధాలు చెప్పని వ్యక్తి ఎవరూ ఉండరని, ‘నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు’ అని చెప్పడమే పెద్ద అబద్ధమని జగపతిబాబు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, తప్పుడు ప్రచారాలను తాను అసలు పట్టించుకోనని చెప్పారు. గతంలో తన మరణంపై కూడా తప్పుడు వార్తలు వచ్చినప్పటికీ స్పందించలేదని, తనకు నచ్చిన విధంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నానని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!