11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

Writer: Harika S 12:02 PM, 11 సెప్టెంబర్, 2026
ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ

నటుడు బ్రహ్మాజీ దర్శకుడు కృష్ణవంశీతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కృష్ణవంశీని మహానుభావుడిగా అభివర్ణించిన బ్రహ్మాజీ.. ఆయన పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. నిన్నే పెళ్లాడతా సమయంలోనే కృష్ణవంశీని తొలిసారి చూశానని, అప్పటి నుంచే ఆయనతో కలిసి పనిచేయాలని బలంగా కోరుకున్నానని తెలిపారు. నటుడిగా స్థిరపడకముందు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కృష్ణవంశీ రూమ్‌మేట్స్ ద్వారా ఆయనకు పరిచయం ఏర్పడిందని చెప్పారు. కృష్ణవంశీ రూమ్‌లో ఉన్నారని తెలిస్తే తాను అక్కడికి వెళ్లేందుకు కూడా భయపడేవాడినని, అందుకు కారణం ఆయన పట్ల ఉన్న గౌరవమేనని వివరించారు.

సింధూరం కోసం తొలిసారి కృష్ణవంశీ నుంచి పిలుపు వచ్చినా.. ఆ తర్వాత ఆ అవకాశాన్ని రద్దు చేయడంతో చాలా బాధపడ్డానని బ్రహ్మాజీ గుర్తుచేసుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత మురారి సినిమాలో అవకాశం ఇచ్చారని, అప్పటి నుంచి తమ మధ్య మంచి స్నేహం, బాండింగ్ ఏర్పడిందని తెలిపారు. సెట్స్‌లో తాము ఎక్కువగా మాట్లాడుకోమని, ఎవరి పనిలో వారు ఉంటూనే పరస్పర గౌరవాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కృష్ణవంశీ తన ప్రతి సినిమాలో దాదాపుగా తన కోసం ఓ పాత్ర రాస్తారని బ్రహ్మాజీ వెల్లడించారు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశానని, ఇటీవల రంగమార్తాండలోనూ పనిచేశానని తెలిపారు. తాను ఎక్కువ టేక్‌లు తీసుకోకుండా ఒక్క టేక్‌లోనే సన్నివేశాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని, కృష్ణవంశీ కూడా ఎక్కువ టేక్‌లను ఇష్టపడరని చెప్పారు. తమ మధ్య ఉన్న ఈ అవగాహనే స్నేహానికి, వృత్తిపరమైన అనుబంధానికి మరో కారణమని బ్రహ్మాజీ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

ఓ దశలో నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా - సమంత

ఓ దశలో నటనకు గుడ్‌బై చెప్పాలనుకున్నా - సమంత

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ట్యాగ్లు
బ్రహ్మాజీకృష్ణవంశీతెలుగు సినిమాటాలీవుడ్బ్రహ్మాజీ ఇంటర్వ్యూమురారిసింధూరంరంగమార్తాండ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఈగల్‌ ఛాలెంజ్‌’కు తొలి స్పందన.. గంజాయి విక్రయాలపై ముగ్గురి అరెస్ట్‌
జనరల్

‘ఈగల్‌ ఛాలెంజ్‌’కు తొలి స్పందన.. గంజాయి విక్రయాలపై ముగ్గురి అరెస్ట్‌

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌..

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ సర్కార్‌ అప్రమత్తం
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ సర్కార్‌ అప్రమత్తం

మెట్రో టేకోవర్‌కు రుణాల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ వేట
జనరల్

మెట్రో టేకోవర్‌కు రుణాల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ వేట

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..
జనరల్

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...
జనరల్

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!
షోస్

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ
సినిమాలు

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!
జనరల్

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!
టెక్నాలజీ

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
జనరల్

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!