

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి నాగదుర్గ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఎంటర్‌టైనింగ్ డ్రామాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్, సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలోని ‘శ్రీలత సాంగ్’ ప్రోమోను విడుదల చేసింది.
కొత్తగా పెళ్లైన శ్రీలత, శ్రీనివాస్ జంట మధ్య సాగే రొమాంటిక్ పాటగా దీనిని తెరకెక్కించారు. ‘ఓ శ్రీలత.. శ్రీలత..’ అంటూ సాగే ఈ పాటకు సురేష్ బొబ్బిలి మెలోడీ ప్రధానంగా ఆకట్టుకునేలా సంగీతం అందించారు. ప్రోమోకు మంచి స్పందన వస్తుండగా, పాట పూర్తి వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తెలంగాణ నేటివిటీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!