

ఇళయరాజా పేరు మరోసారి ఆస్కార్ సీజన్‌లో వినిపిస్తోంది. ఆయన సంగీతం అందించిన మరాఠీ చిత్రం ‘గోంధల్’ ఇప్పటికే భారత్ తరఫున 2027 ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. తాజాగా ఇళయరాజా సంగీతం అందించిన మరో చిత్రం ‘ఆంటోనీ’ కూడా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగం కోసం శ్రీలంక తరఫున పరిశీలనకు సమర్పించబడింది. శ్రీలంకలో రూపొందిన తమిళ చిత్రమైన ‘ఆంటోనీ’ ఇంకా ఆ దేశ అధికారిక ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక కాలేదు. ముందుగా శ్రీలంక జాతీయ ఎంపిక ప్రక్రియను దాటాల్సి ఉంది. శ్రీలంక నేషనల్ ఫిల్మ్ కార్పొరేషన్ ద్వారా ఈ చిత్రాన్ని నేషనల్ ఆస్కార్స్ సెలక్షన్ కమిటీ పరిశీలనకు పంపినట్లు చిత్రబృందం తెలిపింది.
ఆస్కార్ కోసం సమర్పించిన అర్హత ఉన్న శ్రీలంక చిత్రాలను తొమ్మిది మంది సభ్యులతో కూడిన నేషనల్ ఆస్కార్స్ సెలక్షన్ కమిటీ పరిశీలించి, వాటిలో ఒక చిత్రాన్ని మాత్రమే దేశం తరఫున అధికారికంగా అకాడమీకి పంపనుంది. ఈ ప్రక్రియలో ‘ఆంటోనీ’ కూడా పోటీలో ఉంది. శ్రీలంక నేషనల్ ఫిల్మ్ కార్పొరేషన్ షెడ్యూల్ ప్రకారం సినిమాల సమర్పణకు సెప్టెంబర్ 21 సాయంత్రం 4 గంటల వరకు గడువు ఉంది. అనంతరం కమిటీ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, శ్రీలంక తరఫున 2027 ఆస్కార్‌కు వెళ్లే అధికారిక చిత్రాన్ని సెప్టెంబర్ 28న ప్రకటించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!