

కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ప్రియాంక మోహన్ క్రేజ్ ప్రస్తుతం మరింత పెరిగింది. ఇప్పటికే ‘అరసన్’, ‘మంజనత్తి’, ‘కవిన్-9’ వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న ఈ బ్యూటీకి తాజాగా టాలీవుడ్ నుంచి మరో భారీ ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో ప్రియాంక మోహన్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే అక్టోబర్‌లో దసరా సందర్భంగా చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. లక్ష్మణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌కు ప్రియాంక మోహన్ జోడీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే ఆసక్తి నెలకొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!