

మహాభారతం సీరియల్‌లో భీముడి పాత్రతో గుర్తింపు పొందిన నటుడు, ప్రొఫెషనల్ రెజ్లర్ సౌరవ్ గుజ్జర్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారు 2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సౌరవ్‌కు పరిచయమైనట్లు, ఆ తర్వాత వాట్సాప్ ద్వారా వారి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగినట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న సమయంలోనూ, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా తమ సంబంధం కొనసాగిందని ఆమె తెలిపింది. కలిసి వ్యాపారం ప్రారంభిద్దామని సౌరవ్ నమ్మించడంతో అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని వచ్చినట్లు, పెళ్లి గురించి ప్రశ్నించినప్పుడల్లా తనను బ్లాక్ చేసి దూరంగా ఉండేవాడని ఆమె ఆరోపించింది. 2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు తనతో కలిసి ఉన్న సౌరవ్ ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి కొంతకాలం కలిసి ఉన్న అనంతరం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది.
మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు సౌరవ్‌ను గుర్తించి ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిచినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కేసులో మహిళ చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన సౌరవ్ గుజ్జర్ ‘మహాభారతం’లో భీముడిగా నటించి టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. అలాగే ప్రొఫెషనల్ రెజ్లర్‌గా ‘సంగా’ పేరుతో డబ్ల్యూడబ్ల్యూఈలోనూ రింగ్‌లో కనిపించారు. ‘బ్రహ్మాస్త్ర’ సహా పలు చిత్రాల్లోనూ నటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!