
క్రీడలు

రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆగస్టు 21న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సొంతం చేసుకుని భారీ వసూళ్లు సాధించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని అభినందించగా, చిరంజీవి, రామ్‌చరణ్ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారు.

తాజాగా చిరంజీవి, రామ్‌చరణ్ స్వయంగా ‘ఇరుముడి’ బృందాన్ని కలిసి విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌తో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు, వీడియోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!