

సౌత్ చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ప్రియాంక మోహన్. తెలుగు, తమిళ భాషల్లో పలువురు ప్రముఖ హీరోలతో కలిసి నటించి మంచి క్రేజ్ సంపాదించారు. అయితే ప్రస్తుతం ఆమె ఎంచుకుంటున్న సినిమాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఓజీపై భారీ అంచనాలు ఉండగా, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మేడ్ ఇన్ కొరియా ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోయింది. ప్రస్తుతం కవిన్‌తో కె09, మారి సెల్వరాజ్ దర్శకత్వంలోని మంజనత్తి చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు.
తాజాగా ఏజీఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 29వ చిత్రంలో జైకి జోడీగా ప్రియాంక మోహన్ నటించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ర హీరోలతో నటించిన తర్వాత ఆమె ప్రాజెక్టుల ఎంపికపై కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు శింబు నటిస్తున్న అరసన్లోనూ ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా వస్తున్న ఈ సినిమాలతో ప్రియాంక మోహన్ మళ్లీ బలమైన హిట్ అందుకుని తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!