

టాటా గ్రూప్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దని రాహుల్‌కు హితవు పలుకుతూ, రాజకీయ విమర్శలు చేసే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. టాటా గ్రూప్‌ను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారతీయ వ్యాపార సంస్థలు రాజకీయ నాయకుల చేతుల్లో ఆటవస్తువులుగా మారకూడదని, వ్యాపారవేత్తలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించాలని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వాగ్వాదం చోటుచేసుకుంది.
టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌లో నాయకత్వం, పాలనకు సంబంధించిన పరిణామాలు ఈ వివాదానికి నేపథ్యంగా నిలిచాయి. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామక ప్రక్రియపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో సంస్థ నాయకత్వం, నిర్ణయాల ప్రక్రియపై చర్చ మొదలైంది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయగా, నిర్మలా సీతారామన్ వాటిని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో టాటా గ్రూప్‌కు సంబంధించిన వివాదం రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!