

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ దేశీయంగా నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. పూర్తిస్థాయి దేశీయ అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుంచి మొదలుకానుండగా, ఓవర్సీస్‌లో కొన్ని రోజుల క్రితమే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే, భారీ అంచనాలున్న ఈ సీక్వెల్ బుకింగ్స్ రజినీకాంత్ గత చిత్రం ‘కూలీ’తో పోలిస్తే వెనుకబడటం చర్చనీయాంశంగా మారింది.
విడుదలకు ఐదు రోజుల ముందు ‘కూలీ’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3.78 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, అదే సమయానికి ‘జైలర్ 2’ 1.62 మిలియన్ డాలర్లను మాత్రమే సాధించింది. సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉండటంతో పాటు, సినిమా హక్కులు అధిక ధరలకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విడుదలకు ముందు రోజుల్లో బుకింగ్స్ ఎంత వేగం పుంజుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాలు దృష్టి సారించాయి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!