

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. కోలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలకు సమయం దగ్గరపడుతున్నా, ముందస్తు టికెట్ విక్రయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో జోరు కనిపించడం లేదనే చర్చ మొదలైంది.
రజినీకాంత్ గత చిత్రం ‘కూలీ’ విడుదలకు ఒకరోజు ముందు బుక్ మై షోలో దాదాపు 1.8 మిలియన్ టికెట్లు విక్రయించగా, ‘జైలర్ 2’ మాత్రం ఇంకా 1 మిలియన్ మార్కును అందుకోలేదు. ఈ గణాంకాలు అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. సినిమాకు సానుకూల స్పందన వస్తేనే బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ‘జైలర్ 2’ ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ పొందుతుంది? మొదటి భాగం సృష్టించిన విజయాన్ని మళ్లీ పునరావృతం చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!