

కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్', తెలుగులో 'జన నాయకుడు' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఓవర్సీస్ ప్రీమియర్స్, తొలి షోల నుంచి వస్తున్న స్పందన మాత్రం మిశ్రమం నుంచి ప్రతికూలంగా మారుతోంది. సినిమా కథనం, ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
భగవంత్ కేసరి నుంచి ప్రేరణ పొందినట్లు కనిపించే ఈ చిత్రంలో కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్ మినహా కథనం పెద్దగా ఆకట్టుకోలేదని టాక్ వినిపిస్తోంది. విజయ్ స్క్రీన్ ప్రజెన్స్, అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం సినిమాకు బలం చేకూర్చినా, దర్శకుడు హెచ్. వినోద్ కథను ఆసక్తికరంగా మలచడంలో విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుమార్తె సెంటిమెంట్‌కు తగిన స్థాయిలో ఎమోషన్ లేకపోవడం, బాబీ డియోల్ పాత్ర బలహీనంగా ఉండడం, వీఎఫ్ఎక్స్, ఎడిటింగ్, నిర్మాణ విలువలు కూడా విమర్శలకు గురవుతున్నాయి. మొత్తంగా విజయ్ నటన ఉన్నప్పటికీ బలహీనమైన కథనం కారణంగా సినిమా నిరాశపరిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!