
సినిమాలు

తిరుమల ఏడో మైలు ప్రాంతం నుంచి దొంగిలించబడిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకుని, యథాస్థానంలో పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో 20 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా గాలింపు చేపట్టాయి. కేవలం 15 గంటల్లోనే నిందితుడిని ఒంగోలు రైల్వే స్టేషన్‌లో విగ్రహంతో సహా అరెస్ట్ చేయగా, రైల్వే పోలీసుల అప్రమత్తత ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించింది.
స్వాధీనం చేసుకున్న విగ్రహాన్ని బుధవారం రాత్రి తిరుపతికి తరలించిన అధికారులు, తిరుమలలో భక్తుల సమక్షంలో తిరిగి ప్రతిష్ఠించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్యంత వేగంగా కేసును ఛేదించిన తిరుపతి పోలీసుల పనితీరుకు భక్తులు, ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా వ్యవస్థ సమన్వయంతో చేపట్టిన ఈ దర్యాప్తు విజయవంతంగా ముగిసింది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!