
టెక్నాలజీ

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు సమాచారం అందడంతో భద్రతా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ బృందాలు విమానాశ్రయంలోని టెర్మినల్స్‌తో పాటు సున్నితమైన ప్రాంతాలన్నింటిలో విస్తృత తనిఖీలు నిర్వహించాయి.
ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విమానాశ్రయ అధికారులు భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. బెదిరింపు నిజానిజాలను అధికారులు పరిశీలిస్తుండగా, ప్రయాణికులు భద్రతా తనిఖీలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!