
టెక్నాలజీ

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న విడుదలకు సిద్ధమైంది. విడుదలకు ముందు చిత్రబృందం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరవుతారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమా షూటింగ్‌లో కీలక సన్నివేశాల్లో బిజీగా ఉండటంతో, ఆసక్తి ఉన్నప్పటికీ ఆయన ఈ కార్యక్రమానికి రావడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తలతో అభిమానులు నిరాశకు గురవుతుండగా, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!