

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’పై మరో ఆసక్తికర ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో అలనాటి ప్రముఖ నటి జయప్రద కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌కు తల్లి పాత్రలో ఆమె నటించే అవకాశం ఉందనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇప్పటికే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14న ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. జయప్రద పాత్రతో పాటు గ్లింప్స్‌పై కూడా త్వరలో చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!