

‘పర్ణశాల’ సినిమా నుంచి విడుదలైన ‘జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. జిలేబీ తేరా చిన్నోడా’ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. పూర్తి పాట అధికారికంగా విడుదల కాకముందే సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ పాటకు రీల్స్, వీడియోలు చేస్తూ సందడి చేశారు. తాజాగా చిత్ర యూనిట్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా పూర్తి పాటను యూట్యూబ్‌లో విడుదల చేసింది. మాస్ బీట్, క్యాచీ లిరిక్స్‌తో ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.
ఈ పాటను జి. లక్ష్మిదేవి స్వయంగా రచించి ఆలపించారు. పాట ప్రోమోకే వేల సంఖ్యలో రీల్స్, మీమ్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయని దర్శకుడు వై.జి. భరత్ తెలిపారు. ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్, కామెడీ, సస్పెన్స్ అంశాలతో రూపొందుతున్న ‘పర్ణశాల’ త్వరలో థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!