
బిజినెస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. కుడి భుజానికి గాయం కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. గాయం లోతుగా ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని, 24 గంటల్లోనే ఎన్టీఆర్‌ను డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఫిజియోథెరపీ ప్రారంభించినట్లు తెలిపారు.
ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా స్థిరంగా ఉందని, ఆయన కోలుకుంటున్న తీరు సానుకూలంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎన్టీఆర్ ప్యాషనేట్ పర్సన్ అని, పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు సుమారు మూడు నెలలు పట్టవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న ఎన్టీఆర్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు, సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!