

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ఈ చిత్రం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50.30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మరో కీలక మైలురాయిని అందుకుంది. మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మించాయి. రెండో వారంలోనూ సినిమా స్థిరమైన వసూళ్లను రాబడుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లభించిన అదనపు సెలవులు కలెక్షన్లకు మరింతగా కలిసొచ్చాయి.

ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో సినిమా లాభాల జోన్‌లోకి ప్రవేశించినట్లు మేకర్స్ తెలిపారు. తొలి వారాంతంలోనే బ్రేక్‌ఈవెన్ సాధించడం సినిమాకు కలిసొచ్చింది. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ, కామెడీ, వినోదంతో పాటు ప్రధాన నటీనటుల ప్రదర్శనలు సినిమాకు బలంగా నిలిచాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ విభిన్నమైన పాత్రలో ఆకట్టుకోగా, సత్య కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరిస్తోంది. రెండో వారంలోనూ ఆక్యుపెన్సీ, వసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత కలెక్షన్ సాధించే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!