

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సింగ్ గీతం చిత్రం జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై రూపొందించారు. చెన్నైలో జరిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కమల్ హాసన్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘సింగ్ గీతం’ను తాను నిర్మించి ఉంటే బాగుండేదని, నాగ్ అశ్విన్ నిర్మించడంతో అది తన సినిమా అన్న భావన కలుగుతోందని పేర్కొన్నారు. సింగీతం గారి కథలు కాలాతీతమైనవని, ఆయన ప్యాషన్ ప్రతి సినీ కళాకారుడికి స్ఫూర్తి అని కొనియాడారు.
ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘సింగ్ గీతం’ తన 40 ఏళ్ల కల నెరవేరిన చిత్రమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రేమతో, గౌరవంతో నిర్మించిన నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ సింగీతం గారి ప్రశంస తనకు ఆస్కార్ అవార్డు అందుకున్నంత ఆనందాన్ని ఇచ్చిందన్నారు. నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రం రూపుదిద్దుకోవడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాను ఒక వినూత్నమైన, సంగీత ప్రధానమైన సినీ అనుభవంగా అభివర్ణించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!