
సినిమాలు

గోదావరి పుష్కరాలు 2027 విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.150 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పుష్కరాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వివిధ మున్సిపాలిటీలకు కేటాయించింది.
నిధుల కేటాయింపులో భాగంగా రాజమహేంద్రవరం మున్సిపాలిటీకి రూ.100 కోట్లు, కొవ్వూరుకు రూ.20 కోట్లు, నర్సాపురానికి రూ.15 కోట్లు, నిడదవోలుకు రూ.7 కోట్లు, పాలకొల్లుకు రూ.5 కోట్లు, మండపేటకు రూ.3 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పుష్కర ఘాట్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మరమ్మతులు, పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి సౌకర్యాలు, పుష్కరాల ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!