
సినిమాలు

ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమ పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పరిశ్రమ పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
ఈ అంశంపై ఈ నెల 15న ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కేటీఆర్ ప్రత్యేకంగా కలిశారు. సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పరిశ్రమ తిరిగి ప్రారంభమైతే ఆదిలాబాద్ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!