
జనరల్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోదరి సుంకర మెహర్ జ్యోతి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
విషయం తెలుసుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మణిపాల్ ఆసుపత్రికి చేరుకుని మెహర్ జ్యోతి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మెహర్ రమేష్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!