

తమిళ స్టార్ హీరో కార్తీ తన కెరీర్‌లో 30వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ఆయన తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల కోసం నేరుగా ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పటికే జరిగిన పూజా కార్యక్రమాలు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి.
ప్రస్తుతం ‘కార్తీ 30’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. జూన్ 4 నుంచి ప్రారంభమైన లాంగ్ షెడ్యూల్‌లో కార్తీ, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు కల్యాణ్ శంకర్ టేకింగ్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ విలువలతో ఈ చిత్రం పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!