

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కియారా అద్వానీ నదియాగా, నయనతార గంగాగా, రుక్మిణి వసంత్ మెల్లిసాగా, హుమా ఖురేషి ఎలిజబెత్‌గా, తారా సుతారియా రెబెక్కాగా నటిస్తున్నారు. ఆగస్టు 26న తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కియారా తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘టాక్సిక్’లో నదియా పాత్రను గీతు మోహన్‌దాస్, యశ్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని కియారా తెలిపారు. ట్రైలర్‌లో తన పాత్రను చూసిన తర్వాత ఒక నటిగా తనపై తనకే మరింత నమ్మకం కలిగిందని చెప్పారు. ప్రతి చిన్న అంశం కూడా ఎంతో ఆకట్టుకునేలా ఉందని, తనను ఈ సినిమాలో భాగం చేసినందుకు గీతు, యశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లో ‘టాక్సిక్’ చాలా ప్రత్యేకమైన చిత్రమని, సినిమా విడుదలైన తర్వాత ‘టాక్సిక్‌కు ముందు కియారా, టాక్సిక్ తర్వాత కియారా’ అనే స్థాయిలో తన పాత్ర గుర్తుండిపోతుందని కియారా ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!