28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!

Writer: Harika S 10:20 AM, 22 ఆగస్టు, 2026
తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్!

వెంకటేష్.వి.పి. మలయాళ టెలివిజన్, చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా సుడా సుడా ఇడ్లీ అనే రెస్టారెంట్ స్టార్టప్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’లో మురుగన్ పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. డి.జి.పి. అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించనున్నారు. కె ర్యాంప్ వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేష్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.

తిరువనంతపురంలో రెస్టారెంట్ ఆర్డర్లు తీసుకుంటున్న వెంకటేష్.వి.పి.కి నిర్మాత బొమ్మక్ శివ, దర్శకుడు సురేష్ తేజ్ ఫోన్ చేసి సినిమాలో నటించమని అడిగే వీడియోను సరదాగా రూపొందించారు. మొదట తనకు విలన్ పాత్ర ఇస్తున్నారని భావించిన వెంకటేష్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే హీరోగా ఎంపిక చేస్తున్నామని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం కథ విని ఆయన మరింత ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాన్ని ఫన్‌గా చూపించిన వీడియో ఇప్పుడు ప్రేక్షకులను నవ్విస్తోంది. ‘కింగ్డమ్’లో మురుగన్‌గా మెప్పించిన వెంకటేష్.వి.పి. ఇప్పుడు హీరోగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారనే ఆసక్తి నెలకొంది. రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రం ఆయన కెరీర్‌కు ఎలాంటి మలుపు ఇస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

ట్యాగ్లు
వెంకటేష్ వి పికింగ్డమ్విజయ్ దేవరకొండతెలుగు సినిమాసురేష్ తేజ్రుద్రాంశ్ సెల్యులాయిడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలవరానికి తొలిసారి ఎన్‌డీఎస్‌ఏ బృందం..
జనరల్

పోలవరానికి తొలిసారి ఎన్‌డీఎస్‌ఏ బృందం..

‘850’ సీట్ల ముసుగులో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయనివ్వం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

‘850’ సీట్ల ముసుగులో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయనివ్వం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

విమానయాన రంగంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తి..
బిజినెస్

విమానయాన రంగంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తి..

రష్యాలో భారీ భూకంపం..
జనరల్

రష్యాలో భారీ భూకంపం..

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం..
జనరల్

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం..

హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..
జనరల్

హైదరాబాద్‌లో అక్రమ అండాల దందా..

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్
క్రీడలు

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో ప్రజాస్వామ్యానికి ముప్పు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి:  చంద్రబాబు
జనరల్

కరువు, తుపాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించాలి: చంద్రబాబు

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: ముకేశ్‌తో అమన్ ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు..

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు: త్రిగుణ్ ‘చీప్ క్యారెక్టర్’ వ్యాఖ్యపై వర్షిణి ఆవేదన..

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..
జనరల్

విశాఖ కైలాసగిరిపై బోల్తాపడిన స్కూల్ బస్సు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!