
సినిమాలు

హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న వరుణ్ తేజ్ నుంచి వస్తున్న మరో ఆసక్తికర చిత్రం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ హారర్ చిత్రానికి కొరియన్ నేపథ్యం, వినూత్న ప్రమోషన్లు మంచి హైప్‌ను తీసుకొచ్చాయి. విడుదలకు ముందే చెల్లింపు ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు రావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం థియేట్రికల్‌గా సుమారు రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. ఆ టార్గెట్‌ను చేరుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!