

మలయాళ సినీ పరిశ్రమతో పాటు భారత సినీ ప్రపంచం ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సలీం కుమార్‌ను కోల్పోయింది. తన విలక్షణమైన హాస్యం, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కేరళలోని కొచ్చిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
సలీం కుమార్ తన సినీ ప్రస్థానంలో మలయాళం, తమిళం, బెంగాలీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. మిమిక్రీ కళాకారుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం జాతీయ అవార్డు గ్రహీతగా ఎదిగే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ‘ఆదామింతె మకన్ అబు’ చిత్రంలో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ గుర్తింపు పొందిన ఆయన మరణానికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!