

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తుండగా, ఇటీవల గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో మమిత బైజు సూర్యతో కలిసి నటించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పింది. 2015లో సూర్య లులు మాల్లో ఓ కార్యక్రమానికి వచ్చినప్పుడు తాను 8వ తరగతి చదువుతున్నానని, ఆయనను కలవాలని ఎంతో ఆశపడ్డానని గుర్తుచేసుకుంది. అయితే తల్లిదండ్రులు అనుమతించకపోవడంతో తన సోదరుడు, అతని స్నేహితులు సూర్యతో ఫొటో దిగగా, దాన్ని చూసి తాను బాధపడ్డానని తెలిపింది. ఇప్పుడు అదే లులు మాల్లో సూర్యతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని, అభిమానిగా ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా చెబుతున్నానని మమిత పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!