

యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న ఫోక్‌లోర్ అడ్వెంచర్ చిత్రం ‘మత్స్య’. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీబీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ అధికారిక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘అమ్మా.. కొత్త బెడ్‌టైమ్ కథ చెప్పమ్మా’ అంటూ బాబు అడగడంతో ‘ఒక చేప కథ చెప్పనా?’ అంటూ తల్లి చెప్పే మాటలతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అనంతరం ఎన్నో వింతలు, అద్భుతాలతో కూడిన ఆ కథను చెబుతుండగా హీరో పాత్రను రంగులమయంగా పరిచయం చేశారు. వివస్వాన్ స్టైలిష్ లుక్, అప్పియరెన్స్, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి.
గ్లింప్స్ చివర్లో హీరో ప్రయాణిస్తున్న పడవ కింద నుంచి ఓ మిథికల్ ఫిష్ వెళ్లడం ఆసక్తిని పెంచుతోంది. ఫోక్‌లోర్, అడ్వెంచర్ అంశాలను మేళవిస్తూ ‘మత్స్య’ ద్వారా ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాతో వివస్వాన్ ఓ ప్రామిసింగ్ యంగ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!