
జనరల్

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కెరీర్‌లో అనేక సినిమాలను వదులుకున్నప్పటికీ, వాటిలో ఒక సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉంటుందని ఆమె వెల్లడించారు.
నాగార్జున నటించిన క్లాసిక్ మూవీ ‘నిన్నే పెళ్లాడతా’లో హీరోయిన్ పాత్రకు మొదట తనను దర్శకుడు కృష్ణవంశీ సంప్రదించినట్లు మీనా తెలిపారు. అయితే అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు 50 రోజుల డేట్స్ అడగడంతో ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయానని, ఆ అవకాశాన్ని కోల్పోయినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని ఆమె చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!