

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా శుభాకాంక్షలతో నిండిపోయింది. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తుండగా, నటుడు రానా దగ్గుబాటి సతీమణి మిహికా బజాజ్ చేసిన ప్రత్యేక పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. శ్రీలీలను తన “ఫేవరెట్ గర్ల్”గా పేర్కొంటూ ఆమె వ్యక్తిత్వం, కష్టపడే తత్వం, అంకితభావంపై ప్రశంసలు కురిపించారు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మిహికా, శ్రీలీలను అరుదైన రత్నంగా అభివర్ణించారు. ఆమె దయ, కరుణ, నిస్వార్థ ప్రేమే ఆమెను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయని పేర్కొన్నారు. అలాగే నిరంతరం పనిచేసే తీరు, అలసట తెలియని ఉత్సాహం నిజంగా అసాధారణమని కొనియాడారు. “మేము నిన్ను చంద్రుడి వరకు ప్రేమించి మళ్లీ తిరిగి వచ్చేంతగా ప్రేమిస్తున్నాం” అంటూ ఆమె వ్యక్తం చేసిన అభిమానపూర్వక సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!