
రాజకీయాలు

అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ వ్యక్తి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి బాలికకు అందిస్తున్న చికిత్స, వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం బాలిక కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనతో బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!