

విజయ్ దేవరకొండ హీరోగా, దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్దన’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం పూర్తయింది. మిగిలిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం విజయ్ దేవరకొండ ఇటీవల మంగళూరులో జరిగిన షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. గోదావరి ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ నిర్మిస్తున్నారు. సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే కీలక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ఈ సెట్‌లో చిత్రీకరించనున్నట్లు సమాచారం.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రతో పాటు లుక్ కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. గ్రామీణ నేపథ్యం, యాక్షన్ అంశాలు, ఆసక్తికరమైన నటీనటుల కలయికతో ‘రౌడీ జనార్దన’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!