

ప్రతి సినీ పరిశ్రమకు సినిమాల విడుదల కోసం ప్రత్యేక సీజన్లు ఉంటాయి. టాలీవుడ్‌కు సంక్రాంతి ఎంత ముఖ్యమో, మాలీవుడ్‌కు ఓణం సీజన్ అంతే ప్రత్యేకం. అందుకే ఈ ఏడాది ఓణం పండుగను టార్గెట్ చేస్తూ పలువురు మాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 20న విడుదల కానుండగా, ఇందులో మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
మరోవైపు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘I Am Game’ చిత్రం కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. హీస్ట్, గ్యాంబ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘RDX’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటిస్తున్న ‘Bethlehem Kudumba Unit’ కూడా ఓణం సీజన్‌కే విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ఓణం రేసులో నిలవడంతో ఈసారి మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!