
జనరల్

మైత్రీ థియేటర్స్ తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకం సర్వపిండిని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. మైత్రీ విమల్, మైత్రీ శివ గంగ థియేటర్లలో ‘ది ప్యారడైజ్’ సినిమా ఇంటర్వెల్ సమయంలో సర్వపిండిని ప్రత్యేకంగా అందించనున్నారు. దీంతో థియేటర్ అనుభవానికి తెలంగాణ రుచిని జోడించనున్నారు.

సాంప్రదాయ తెలంగాణ వంటకమైన సర్వపిండిని ‘బామ్మ స్టోరీస్’కు చెందిన 77 ఏళ్ల బామ్మ ప్రేమతో తయారు చేస్తున్నారు. చిన్న టిఫిన్ సెంటర్ నుంచి తెలంగాణలోని ప్రముఖ థియేటర్ల వరకు సర్వపిండికి చోటు దక్కడం విశేషంగా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకులకు సినిమా వినోదంతో పాటు స్థానిక రుచిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!