
రాజకీయాలు

నాచురల్ స్టార్ నాని హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ది ప్యారడైజ్. టాలీవుడ్‌లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. పలు అవాంతరాల అనంతరం ఈ చిత్రాన్ని ఎట్టకేలకు థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
నానికి బలమైన మార్కెట్‌గా ఉన్న యూఎస్, నార్త్ అమెరికాలో ది ప్యారడైజ్ మంచి స్పందనను అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీసేల్స్‌లో హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. దీంతో విడుదలకు ముందే సినిమాపై ఉన్న ఆసక్తి స్పష్టమవుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తోంది. ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న పలు భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!