
జనరల్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో కీలక మైలురాయిని అందుకుంది.
థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా ‘ది ప్యారడైజ్’కు మంచి రికవరీ నమోదైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో 92 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 60 శాతం, ఓవర్సీస్ మార్కెట్లలో 73 శాతం రికవరీ సాధించినట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు సూచిస్తున్నాయి. నాని కెరీర్‌లో మరో భారీ విజయంగా నిలిచేందుకు ఈ చిత్రం దూసుకెళ్తుండటంతో అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!