

విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ‘నారాయణమ్మ’ ఫస్ట్ సింగిల్ మరింత ఆసక్తిని పెంచుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎనర్జిటిక్ బీట్స్, ఫోక్ టచ్‌తో ఈ పాటను రూపొందించగా.. రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించారు. రామ్ మిరియాల, హేష నాగుల ప్రభ ఆలపించిన ఈ పాటలో మాస్ ఎనర్జీతో పాటు ఫోక్ ఫ్లేవర్ ఆకట్టుకుంటోంది. పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన కనిపిస్తోంది.
ఇక ‘నారాయణమ్మ’ సాంగ్‌లో శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతి, నివేదా పేతురాజ్‌లతో కలిసి వెంకటేశ్ వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తనదైన స్టైల్, చిలిపి ఎక్స్‌ప్రెషన్స్‌తో వెంకీ మామ అలరించగా.. ముగ్గురు కథానాయికలతో ఆయన కెమిస్ట్రీ, డ్యాన్స్ మూమెంట్స్ పాటకు మరింత కలర్ తీసుకొచ్చాయి. థమన్ సంగీతం, ఫోక్ టచ్, వెంకటేశ్ స్టైల్ కలయికతో ఈ పాట సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!