

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు సినీ వర్గాల్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీరిద్దరి కలయికలో మరో ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కనుంది. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా, సోషియో-ఫాంటసీ అంశాల కలయికగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించనున్నట్లు సమాచారం. తమిళ కడవుల్ లార్డ్ మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) నేపథ్యంతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇటీవల విక్టరీ వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌పై కీలక విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, తారక్‌ను వెండితెరపై ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. ఈ చిత్రానికి ఇంకా అధికారికంగా టైటిల్ ఖరారు కాలేదు. అయితే ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!